ముందుమాట

తెలుగు బ్లాగర్లందరికీ నమస్కారం
సంకలిని అనేది తెలుగు బ్లాగులను ఒకచోట చేర్చి వాటిని వివిధ విభాలలలో చూపించే ఒక వేగవంతమైన అగ్రిగేటర్.
సంకలిని ప్రత్యేకతలు 
  •  ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం 
  • వ్రాసిన పోస్ట్ ని ఒక్క నిమషం కన్నా లోపలే దాదాపు ముప్పై (30 -50 )సెకన్లలో అందిస్తుంది 
  •  హోం పేజి లో 50 నుంచి 80 టపాలు చూపబడతాయి ప్రతి పది నిమషాలకి ఒకసారి సంకలిని ఆటో రిఫ్రెష్ అవుతుంది 
  • ఒక బ్లాగర్ ఒక రోజులో ఎన్ని టపాలు వ్రాసినా అన్నీ టపాలు చూపబడతాయి. రోజుకి రెండు బ్లాగులే చూపబడతాయి అన్న నిబంధనలు ఏమీ లేవు 
  •  టాపా శీర్షిక ( పోస్ట్ టైటిల్) లేకపోయినా టపా చూపబడుతుంది. బ్లాగర్ శీర్షిక పెట్టడం మరిచిపోతే, తరువాత శీర్షిక పెడితే , ఆ శీర్షికని అప్ డేట్ చేసుకుంటుంది 
  • వివరంగా చూడటం కొరకు ఇక్కడ నొక్కండి అన్ని ఉన్న చోట మీరు నొక్కితే , 
టపా వ్రాసిన వారి పేరు,
వ్రాసిన సమయం,
టాపా యొక్క వర్గం, ( బ్లాగర్ తన టపాని వర్గీకరిస్తే మాత్రమే ),
టపా కు సంభందించిన మొదటి మూడు లైన్లు కూడా చూపబడతాయి 
వాఖ్యలు :- 
  •  పేజి కి 100 కామెంట్స్ చూపబడతాయి 
  • ఒక నిర్ణీత సమయం లో ఒక బ్లాగు నుంచి వచ్చిన కామెంట్స్ ఒక చోట చూపబడతాయి. దీనివల్ల కామెంట్స్ చదువు కోవడం చాలా సులువు
  • అజ్నాతల కామెంట్స్ కూడా చూపబడతాయి , కాకపొతే శ్రుతి మించిన కామెంట్స్ విషయం లో సమయానుసారం స్పందించడం జరుగుతుంది 
  • వ్యక్తి గత దూషణలకి పాల్పడిన కామెంట్స్ ఉంటె ఆ బ్లాగునుంచి వచ్చే కామెంట్స్ తాత్కాలికం గా నిలిపివేయబడతాయి 
విభాగాలు:- 
  • బ్లాగర్లు వ్రాసిన టపాలని కొన్ని ముక్ష్య విభాగాలుగా వర్గీకరించి చూపబడుతుంది
  • మీరు గుత్తి వంకాయ గురించి వ్రాస్తే అది వంటల విభాగం లోనూ ,గురజాడ అప్పారావు గురుంచి వ్రాస్తే అది సాహిత్య విభాగం లోనూ చూపబడుతుంది 
  •  ఈ విధమైన వర్గీకరణ టపా వ్రాసిన వెంటనే జరుగుతుంది, కొన్ని సంకలినులలో టపాల వర్గీకరణ నాలుగు రోజుల తరువాత జరుగుతుంది 
  • ఒకొక్క విభాగం లో 50 టపాలు చూపబడతాయి 
  • అన్నీ విభాగాలలోనూ మొదటి 5 టపాలు హొం పేజి లో చూపబడతాయి. అక్కడ మరిన్ని అని ఉన్న లింకును క్లిక్ చేయడం ద్వారా ఆయా విభాగాలలోకి నేరుగా వెళ్ళొచ్చు 
  •  ప్రస్తుతం 17 విభాగాలతో ఉన్న సంకలిని త్వరలో మరిన్ని విభాగాల కోసం కృషి చేయడం జరుగుతుంది 
ఇతరత్రా
  • నిఘంటువుల లింకుని జతపర్చదమైనది 
  • బ్లాగర్లకు నచ్చిన ఫాంట్ సైజు ఎంచుకునే అవకాశం కల్పించడమైనది ( పెద్దవారు చిన్న చిన్న అక్షరాలను చదవడానికి కష్టపడకుండా) 
విన్నపాలు 
  •  హొం పేజి లో ఒక్క పోస్ట్ ఉండేటట్లు ప్రయత్నించండి ( పేజి లోడ్ త్వరగా అవుతుంది. మొబైల్ లో బ్లాగులు చదివే వారికి ఇబ్బంది ఉండదు )
  •  లేబుళ్ల విడ్జెట్ పెట్టుకుంటే అంశాల వారీ చదువుకునేందుకు సులువుగా ఉంటుంది 
  • ఒకరి మీద మరొకరు వ్యక్తిగత దూషణలకు మీ బ్లాగుని వేదిక చేయవద్దు 
  • 3rd క్లాసు కామెంట్స్ ని ఆమోదించద్దు.
  • చెత్త కామెంట్స్ కి మీ బ్లాగ్ ఒక వేడుక అయినట్లయితే మీకు ముందస్తుగా ఒక మాట చెప్పి మీ బ్లాగ్ లో వచ్చే కామెంట్స్ ని తొలగించడం జరుగుతుంది 
  • సంకలిని కి ఉపయోగించిన రంగులు మీకు ఎమన్నా ఇబ్బందిగా అనిపించినా, ఏ విషయం అన్నా మీకు నచ్చని యెడల నిర్మొహమాటం గా తెలియ చేయండి 
కృతఙ్ఞతలు 
  • రహ్మానుద్దిన్ గారికి 
  • వీవెన్ గారికి 
  • మౌళి గారికి 
  • శరత్ గారికి 
  • రాజేష్ G గారికి 
  • లినక్సు ప్రవీణ్ గారికి
  • శివ భండారు గారికి 
  • తెలుగు బ్లాగర్లకు
  • కూడలి, జల్లెడ, హారం, మాలిక, సమూహము నిర్వాహకులకు

35 comments:

కృష్ణశ్రీ said...

మీ కృషి శ్లాఘనీయం.

కానీ, మేము మా బ్లాగులని దీనికి లింకు చేసుకోవడానికి "ఫలనా"వాళ్లని సంప్రదించండి; "ఫలనా" పనులు చేయండి--అనకుండా మీరు చెయ్యగలిగితే, చాల సంతోషం!

ప్రయత్నించండి.

ప్రభు said...

ప్రియ అప్పారావు శాస్త్రి గారూ !
మీ వ్యాఖ్య నన్ను మీ సంకలిని వేపు వెళ్ళేలా చేసింది !
అన్నివిధాలుగా ప్లాన్ చేసి మీరు సంకలిని తయారు చేసిన విధమ్ చూస్తే ముచ్చటేసింది !
ముఖ్యంగా ఇందులో తమ పోస్టులను ఉంచడానికి బ్లాగర్లు ఎటువంటి ప్రయాసలూ పడనవసరం లేకపోవడం ఇంకా బావుంది !
మీ సంకలిని బాగా అభివృద్ధి చెంది దాని ద్వారా బ్లాగర్లు కూడా లబ్ది పొందాలని ఆశిస్తాను !
- మీ తెలుగోడు (ప్రభాకర్ )

రావెమ్మెస్సారెల్ said...

శ్రీ అప్పారావు శాస్త్రి గారికి, నమస్తే.

మీ సంకలిని వంక పెట్టడానికి వీలు లేకుండా,

పకడ్బందీగా ఉంది.

మీ "సంకలిని" తెలుగుబ్లాగుల అగ్రిగేటర్లనే

శివుని శిరసున "నెలవంకలిని".

సమస్త బ్లాగుల పనసతొనలిని.

చాల బాగా నిర్వహిస్తున్నారు.

మీ కృషికి హృదయపూర్వక అభినందనలు.

అన్ని రకాలుగా బాగుంది.

ఇంతవరకు సంకలిని విషయంలో ఏ ఇబ్బంది ఎదురుకాలేదు.

అందువల్ల నో నెగెటివ్ కామెంట్స్.

అన్నీ పాజిటివ్ కామెంట్సే.

ఎప్పుడు ఏ సలహా తోచినా చెప్పగలవాడను.

తరువాత టపాను బట్టి విభాగం అన్నారు.

కాని నా మేఘసందేశం సాహిత్యవిభాగంలోకి రాదా?

ఎప్పుడూ ఆ విభాగంలో కనబడదు?

కారణం వివరించగలరు.

శుభాభినందనలతో

రావెమ్మెస్సారెల్

Sudha said...

సంకలిని ని మొదటిసారి ఇప్పుడే చూస్తున్నాను. అన్ని బ్లాగులను విభాగాల వారీగా చూపించడం బావుంది. నిఘంటువుల లింక్ ఇవ్వడం చాలా నచ్చింది. ఇతర అగ్రిగేటర్స్ లో ఈ సదుపాయం లేదు.
అలాగే..కంప్యూటర్ లో తెలుగు ఎలా రాయాలి, అసలు రాయగలమా, బ్లాగును ఎలా తెరుచుకోవాలి -ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం వెతికే వారు చాలామంది కనిపిస్తున్నారు. అందువల్ల కంప్యూటర్ లో తెలుగు రాయడానికి గల సదుపాయాలను చూపే లింకులను వీలయినంత ప్రస్ఫుటంగా కనిపించే రీతిలో మీ సంకలిని లో పొందుపరిస్తే బావుంటుందని నా సలహా...వీలవుతుందేమో చూడండి.
అభినందనలు.

రావెమ్మెస్సారెల్ said...

కృతజ్ఞతలు.

నా టపాను సాహిత్యవిభాగంలో ఉంచినందుకు.

తర్వాత ఒక చిన్న సూచన.

ఉదయం వ్రాసిన టపా సాయంత్రానికి ఉండడం లేదు.

సాయంత్రం తీరుబడిగా సంకలినిని ఓపెన్ చేసినవారికి ,

ఉదయం టపాలు కనబడే అవకాశం ఉండదుగా!

అందువల్ల ఒక బ్లాగునుండి వేరొక టపా వచ్చే దాకా

పాత టపాను ఉంచితే బాగుంటుంది.

ఆలోచించండి.

టెంకణాలు.

గోలి హనుమచ్ఛాస్త్రి said...

సంకలిని విభాగాల అమరిక చాలా బాగుంది
వారి వారిఅభిరుచులను బట్టి త్వరగా ఆయా పేజిలకు వెల్లగలిగేట్టుగా వుంది.
నా బ్లాగును సాహిత్యవిభాగంలో ఉంచినందుకు.
చూపుచున్నందులకు ధన్యవాదములు.కాని ఉదయం
కనిపించిన నా టపా సాయంత్రానికి కనబడడం లేదు.
మిగిలినవి బ్లాగులవి కనిపిస్తున్నాయ్.
సరిచేయగలరు.

n.swar said...

నమస్కారమండి.

మీ సంకలిని ఆమూలాగ్రం చూశా.

టపా 30 సెకన్లలో వస్తుందన్నారు. బాగుంది.

మరి కొత్త బ్లాగ్ మీ సంకలినిలో చేరడానికి ఎన్ని రోజులు పడుతుంది?

నా నాగస్వరం అనే బ్లాగ్ను చేర్చమని అప్లికేషన్ పెట్టా.

మనవి మన్నించండి.

http://www.nagaswaram.blogspot.com

n.swar

SEVA said...

నమస్కారములు.
మీ(మా ) సంకలిని చూస్తున్నాము. మీ ప్రయత్నం విజయ వంతం.
మాబ్లాగులను సంకలిని లో సంకలిని చేసినందులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
లింకులను కలిపి మీరు మెయిలు పంపిన తర్వాత చూసి చాలా ఆనందించాను.
సంకలినికి, సేవకు చాలా దగ్గరి సంబంధ భావాలున్నాయి. సైటును గ్రహిస్తే యిట్టే అర్ధమవుతుంది.
ఎన్ని సైటులున్నా.. ప్రత్యేకంగా సంకలిని మాత్రమే లోగోతో http://sevalive.com/ లో లింకును కలిపాము. పరిశీలించగలరు. మీతో మరిన్ని విషయాలను చర్చలనుకుంటున్నాను. సంప్రదించడానికి వ్యక్తిగత కాంటాక్ట్ నెంబర్ యివ్వగోర్తాను.
- కంచర్ల సుబ్బా నాయుడు,
ఎడిటర్, సేవ, తిరుపతి.
మా ఫోన్: 9492224666,9492666660
mails : sevaonlive@gmail.com ;
editor.seva@gmail.com

Anonymous said...

ayaa
meeche niravhinchabade web site chalabagundi.
annintiki vibinnanga vunnayi.
saddi vaatrhalaku thavu ivvakani.
alage english sitlukann telugu varthalake thavu ivvandi.

Andhra recipes andhravantalu, RSS Feed Manyaseemalu, sira kadanbam,SPECTRUM ,gorrelamanda varthalu thagginchadi.. padindhe padara antunnyi aa situlu.. vachina vaarthalanu malli vasthuntaayi avi.

meeku manchi peru vasthunndhi.

koodali, jalleda, malika lnu minchi mee situ bagunndhi.

anni rakala varthu ivvdam mee special laa vunnadhi. bagundi.


namaskaaramulu.


- B.L.Prasad

నందు... said...

naa blog kanipinchatledhu

yakoob said...

sankalini'krushi shlaaghaneeyam...!

Anonymous said...

అందరూ భాగానే చెప్పారు కానీ సంకలిని వారు సమూహము ను కాపీ కొట్టారు .నాకు సంకలిని ఏమి స్పెషల్ కనిపించటం లేదు .colors కూడ అంత భాగాలేగు.
నేను చెప్పినది సరి అవునో కాదో ఒకసారి http://www.samoohamu.com/ ను దర్శించండి .

Anonymous said...

Krushinaa thokka.Antha copy kottudegaa?

Anonymous said...

కంచర్ల సుబ్బా నాయుడు garu,
Meru sankaline logotho yenduku pettarante sankalini kooda meede kanuka.aa vishayamu cheppochukada yedukantha dokathirugudu?

Anonymous said...

మిత్రమా!
దొంక తిరుగుడు.. గట్రా. .. ఏమి లేవిక్కడ.
సంకలిని నిర్వాహకులు అప్పారావు గారు.. హైదరాబాద్ లో వుంటారు. "సేవ" సంపాదకులు సుబ్బానాయుడు... తిరుపతిలో వుంటారు. సంకలిని, సేవ భావాలు ఒకటి కావచ్చు కాని.. సంస్థలు, నిర్వాహకులు..వేర్వేరని గ్రహించాలి.
కాగా.. లక్ష్యాలు ఒకటయినప్పుడు..ఎవరేమనుకున్నా పర్వాలేదని నిర్వాహకులిరువురి అభిప్రాయం.

Anonymous said...

సంకలిని చూస్తున్నాము. బాగుంది. సమూహం కు సంకలినికి తేడావుంది. విమర్శలు పట్టించుకోకండి శాస్త్రిగారు. కొంతమంది వెధవలు.. పనిగట్టుకొని వుంటారు. వారి బ్లాకులను కలుపకపోతేనో,, వారు వ్రాసిన చెత్త రచనలు , వ్యాఖ్యానాలు మనం వేయకపోతేనో..ఇలాంటివి రాస్తుంటారు.. నచ్చితే చదవాలి, నచ్చకపోతే.. వదిలివేయాలి.. అంతే కానీ పనికి మాలిన చెత్త కామెంట్లు చేస్తే సభ్యత అనిపించుకోదు.. మీ కృషిని అభినందించి నందులకు బదులుగా. తొక్క గిక్క అంటాడా వెధవ.. అలా కుళ్ళు కామెంట్లు ఎందుకు చేయాలి వెధవ. నిజంగా ఆ వెధవకు నీతి, నిజాయితీ , సభ్యత, సంస్కారం వుంటే తనపేరు వెల్లడించే వాడు. ఇలాంటి వెధవను.. సాహితీ ప్రపంచం నుంచి వెలివేయాలి.. అంటరానివాడిగా....
విమర్శలు.. చేయాల్సిందే.. అవి ఆహ్వానించ తగినవిగా వుండాలి?
- శోభ, చెన్నై

Anonymous said...

sobha garu,
aa thedaa yemito chebithe andaru santho sistharu.

Anonymous said...

పచ్చిగా.. చెప్పాలంటే.. లోకమంతా పచ్చగా కనిపించే పచ్చ కామెర్లోడికి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా.. ప్రయోజనం ఏముంది? శోభరాజు గారు. అతగాడు సంతోషించేది ఏమీ లేదు! .. మళ్ళీ ఓ కుళ్ళు కామెంట్ చేయడం తప్ప. అందుకే.. విషయం మన విఘ్నులకే వదిలేయండి.. శోభ గారు!...
- అరుణ

మంగా మణి said...

సాధారణంగా అగ్రిగేటర్స్ వారి సైటులో ఉన్న అన్ని టపాలను పరిశీలిస్తారని అనుకోను, కాని శ్రీ అప్పారావు శాస్త్రి గారు సునిశితంగా పరిశీలిస్తారని మొన్న నా టపాకు వారు సూచించిన వ్యాఖ్యలే నిదర్శనం. వారి వ్యాఖ్యలకు ధన్యవాదాలు. "దటీజ్ సంకలిని"

::బ్లాగిల్లు:: said...

http://blogillu.com nu choosara

పల్లా కొండల రావు said...

'సంకలిని'ని ఇటీవలి కాలం లో చూడలేదు . గతంలో చూసినపుడు బాగాలేదనిపించింది. ఇపుడు చాలా మెరుగైనది. మెరుగే కాదు . దాదాపు ఇపుడున్న అగ్రిగేటర్లలో ఇదే బాగుంది. బాగా డెవలప్ చేసారు. కానీ ఇంకా ప్రచారం పొందలేదనిపిస్తుంది. ఏమైనా సంకలనిని బాగా డెవలప్ చేసినందుకు అభినందనలు.

rachuri said...

అయ్యా,ఈరోజె సంకలిని చుసాను చాలాబాగుంది,నెను నా బ్లాగ్ ని
సంకలినిలో చెర్చలనుకుంటున్నాను,దయచేసి నాకు అవకాసం
కలిగించండి.ఎలా చెరాలి?ఎన్ని రోజులలో చేరగలను,

నిరంతరమూ వసంతములే.... said...

దయచేసి నా బ్లాగు http://nityavasantam.blogspot.com ను సంకలినిలో జత చేయండి.

sreenu said...

మంచి మంచి బ్లాగులను పరిచయం చేస్తున్నారు బాగుంది
దయచేసి నా బ్లాగుని జత చేయండి
www.sndinchani.bogsot.com

Hari Podili said...

శ్రీ అప్పారావు శాస్త్రి గారికి-నమస్కారములు

నేను రచయితను కాను,
కవిని కాను,
కాలమిస్టును కాను-అయితే

మనదేశములో జరిగే
అన్యాయాలు,అరాచకాలు,
అక్రమాలు,దొపిడీలు,
మోసాలు,దమనకాండలు మొదలగు
ఈవిల్స్ ని చిన్నప్పటినుంచి చూసి చూసి,విసిగి విసిగి,ఏమీచేయలేక, మనము ఏమీ చేయలేమా అని అనుకునే ఓ సగటు జీవిని.

ఎమీ చేయలేక నాలోని ఆవేశాన్ని,ఆక్రోశాన్ని
ఆవేధనను,బాధను,స్పంధనను పంచుకోవాలనుకొని
manamu emee cheyalemaa.....? అనె ఓ చిన్నblog nu open చేసాను .
naa ee chinni prayatnaanni mee SANKALINI dwaaraa encourage chestaarani aasistunnaanu,koarutunnanu.

కృష్ణశ్రీ said...

హరి పొదిలి చక్కటి ప్రశ్నలు సంధిస్తున్నారు. మనం యేమీ చెయ్యలేమా? బ్లాగుల్లో యేకగలం కదా?!

తెలుగు చక్కగా వ్రాయడం ప్రయత్నించండి.

కీసర బాసరలు కేవలం పర్యాటక కేంద్రాలగానే సందర్శించండి.

మీ బ్లాగులో "వర్డ్ వెరిఫికేషన్" చాలా దరిద్రంగా వుంది. తొలగించండి.

కీపిటప్!

sreenu said...

మంచి మంచి బ్లాగులను పరిచయం చేస్తున్నారు బాగుంది
దయచేసి నా బ్లాగుని జత చేయండి
www.spandinchaalani.blogspot.in

Hari Podili said...

థాంక్సండి, మీ సంకలినిలో నా బ్లాగు కు చోటి కల్పించినందుకు.

Dare2Write said...

Sri Ramanavami SubhakaMkshalu

సూర్య said...

శ్రీ అప్పారావు శాస్త్రి గారికి నమస్కారములు
'సంకలిని'లో పెద్దగా మార్పులు కనిపించడంలేదు. అసలెందుకు దీని నడుపుతున్నారో అర్ధం కాలేదు. నలుగురికి ప్రయోజనం ఉండేలా కూడలి, మాలిక లా అన్ని బ్లాకులను సమూహం చేసి నడపండి. తెలుగు వార్తా ప్రపంచంలో ఎన్నో మంచి వెబ్ సైట్సు వున్నాయి. అన్నిటినీ కాకపోయినా తెలుగు దిన పత్రికలను, అంతర్జాల పత్రికలను,మరిన్ని బ్లాగులను కలపండి.
- రమాదేవి, హైదరాబాద్

mouli valmikam said...

ఈ రోజే సంకలిని చూసాను.నాకు చాలా నచ్చింది. నేను కూడా బ్లాగు లో రాయ గలనని అనిపిస్తుంది.

kastephale said...

సంకలిని వారికి,
నమస్కారం. సంకలిని చాలా త్వరితంగా పని చేసే అగ్రిగేటర్, అనుమానం లేదు.
ఒక్కటే నా కోరిక. వ్యాఖలు ఎవరు చేసినవి వారికి ప్రత్యేకంగా ఒక చోట కనుపించేలాగా, ఎన్ని వ్యాఖలు చేసిన దాని మీద క్లిక్ చేస్తే కనపడేలా చేస్తే బాగుంటుందని నా మనవి, హారంలో లాగా. హారంను ప్రస్తుతానికి మూసివేస్తున్న సందర్భంలో మీరీ మార్పు చేస్తే మీదే మొదటి అగ్రిగేటర్ అవుతుంది, అనుమానం లేదు.
ధన్యవాదాలు.
శర్మ.

ఆదూరి హైమవతి said...

సంకలిని బావుంది.ఈరోజే చూశాను, నాబ్లాగూకలపమనికోరాను.
ఆదూరి.హైమవతి

kothapalli said...

manchi prayatnam. 82 mandi blogs okechota choodagalgadam sadhyam chesins meeku hats off.
kothapalli ravibabu

Kalluri Bhaskaram said...

సంకలినిని ఈమధ్యనే చూశాను. బాగుంది. మీరు నిర్దేశించిన ప్రమాణాలు కూడా బాగున్నాయి. కల్లూరి భాస్కరం అనే పేరుతో నేను ప్రారంభించిన బ్లాగ్ ను లింక్ చేయమని రెండు రోజుల క్రితం కోరాను. వివరాలు ఫిల్ చేశాను. ఇంతవరకు లింక్ చేయలేదు. టెక్నికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు. నా url: kbhaskaram.blogspot.com చర్య తీసుకోగలరు.

Post a Comment